Silly-Fellows“సిల్లీ ఫెలోస్” ద్వారా నేడు ప్రేక్షకులను పలకరించిన అల్లరి నరేష్, నిన్నటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నాడు. అందులో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తన సోదరుడు ఆర్యన్ రాజేష్ చేస్తోన్న సినిమా గురించి ప్రస్తావించాడు. బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఆర్యన్ రాజేష్ ఓ కీలక పాత్ర చేస్తోన్న విషయం బహిరంగమే.

అయితే ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ లో ఆర్యన్ కనిపిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నరేష్ స్పందిస్తూ… అన్నయ్య చేస్తున్నది నెగటివ్ రోల్ కాదని, చాలా మంచి పాత్ర చేస్తున్నాడని, ఈ రోల్ ద్వారా అన్నయ్యకు మంచి పేరు వస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. ఆర్యన్ ఎక్కువగా మాట్లాడడు గనుక, దీనిపై తాను వివరణ ఇస్తున్నానని అన్న మీదున్న ప్రేమను చాటిచెప్పుకున్నాడు నరేష్.