Siddaramaiah-lost electionsin 2 constituenciesకర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక్కగానొక్క పెద్ద రాష్ట్రాన్ని లేకుండా చేసారు. ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు స్థానాల నుండి పోటీ చేశారు. బాదామి నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి శ్రీరాములుపై ఆయన కేవలం 3వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఒక విధంగా ఆయనకు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయ్యింది. మరో నియోజకవర్గం చాముండేశ్వరిలో ఆయన జేడిఎస్ అభ్యర్థి హెచ్ డీ దేవే గౌడ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. మరోవైపు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ… మూడో స్థానంలో ఉన్న జనతా దళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీతో తాము పొత్తుకు సిద్ధం అని వెల్లడించింది. జేడీఎస్‌ కనుక ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటే ఆ పార్టీకి మళ్ళీ అవకాశం రావొచ్చు.