Shyamala - Nutan Naiduబుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతోన్న ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్ళడానికి సెలబ్రిటీల కొరత ఏర్పడిందా? అంటే అవుననే సమాధానమే ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ప్రతి వారం ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తూ… ఆ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరిని ప్రవేశపెట్టడం అనేది సాధారణంగా బిగ్ బాస్ గేమ్ ప్రక్రియ. అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఈ వారంలో ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం పక్కనపెడితే, ఇప్పటికే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామల మరియు నూతన్ నాయుడులను హౌస్ లోకి ప్రవేశపెట్టారు. ఒక్కసారి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తిని ప్రదర్శించరు. కానీ వెళ్ళిపోయిన అయిదుగురిపై ఓటింగ్ నిర్వహించి, ఇద్దరినీ మళ్ళీ లోపలికి పంపడం విస్తుగోలిపే అంశం.

కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడూ షోను లైవ్ గా ఉంచుతాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అంతగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో, మళ్ళీ పాత వారినే ప్రవేశపెట్టాల్సి వచ్చిందనేది లేటెస్ట్ టాక్. సీజన్ 1లో అయితే ఇలా ఎగ్జిట్ అయిన వారిని కాకుండా, ఎప్పటికప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా కొత్తవారిని ప్రవేశపెట్టి, షోను రక్తి కట్టించిన వైనం తెలిసిందే.