Pawan Kalyan - Shruti Haasan - Vakeel Saab-.పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ చిత్రం వకీల్ సాబ్ మే నెలలో సమ్మర్ స్పెషల్‌గా విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనా ప్రభావం కారణంగా ఇది నిరవధికంగా వాయిదా పడింది. ఆ సినిమాకు సంబంధించిన 20% షూట్ ఇంకా పూర్తి కాలేదు. షూటింగులు తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, షూటింగ్ ప్రారంభం కాలేదు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చెయ్యాల్సి ఉంది. ఆ భాగాలు షూట్ చెయ్యాలి. వకీల్ సాబ్ బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమా రీమేక్. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని బట్టి సినిమాలో మార్పులు చేర్పులు చేశారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

హీరోయిన్ గా శృతి హాస్సన్ ను ఫైనల్ చేశారు. అయితే ఈ భామ వచ్చే అక్టోబర్ లో గనుక వారు షూట్ చెయ్యగలిగితే తాను సినిమా చేస్తానని తేల్చి చెప్పిందంట. ఆ తరువాత డేట్స్ ఇవ్వడం కష్టమని చెప్పేసిందట. అయితే పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఇప్పట్లో షూట్ చెయ్యడం కష్టమే అని చెప్పేశారు.

“కేసులు ఇంకా పెరుగుతున్నందున ఎవరైనా షూట్ను తిరిగి ప్రారంభించడం మంచిది కాదు. కరోనా మహమ్మారిని నివారించడానికి శారీరక దూరం పాటించడం తప్పనిసరి. కేసులు గణనీయంగా తగ్గినప్పుడే షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతాయి” అని ఆయన చెప్పారు. అక్టోబర్ నాటికి కేసులు తగ్గే అవకాశాలు తక్కువే.

దీనితో వకీల్ సాబ్ టీం కొత్త హీరోయిన్ ని వెతుక్కోవాలా అనేది చూడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కనీసం సంక్రాంతి 2021 కోసం విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు కోరుకుంటారు. అక్టోబర్ లో గనుక షూటింగ్ ప్రారంభమైతే సంక్రాంతి విడుదల సాధ్యం అవుతుంది.