shriya-saran-kajal-aggarwal-tamannaah-ileana-who-s-bestచక్కని చుక్కలన్నీ ఒక దగ్గర చేరితే… కన్నుల విందేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో..! అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ తారామణులైన కాజల్ అగర్వాల్, ఇలియానా, తమన్నా, శ్రియాలందరూ ఒక దగ్గర కలిసి ఉన్న సందడి చేస్తోన్న ఈ ఫోటో ఎక్కడిదో గానీ, ఈ నలుగురి ముద్దుగుమ్మలలో ఎవరు ఆకర్షణీయంగా ఉన్నారు? అన్న కాంటెస్ట్ పెడితే…

ఎవరి ఫేవరేట్ హీరోయిన్ల పేరు వారు చెప్తున్నప్పటికీ, ప్రస్తుతం మెగాస్టార్ సరసన “ఖైదీ నంబర్ 150”లో అందాల విందు చేస్తున్న కాజల్ మాత్రం కేక అంటున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలోనూ గ్లాస్ చేత పట్టుకుని అందాల విందు చేస్తోంది కాజల్. అయితే కాజల్ తర్వాత స్థానాలు ఎవరివి అనేది కూడా చూడాలి మరి..! బహుశా ఆ వరుసలోనే ముద్దుగుమ్మలు దర్శనమిస్తున్నారేమో… ఓ లుక్కేయండి..!