shriya-saran_టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఢిల్లీ భామ శ్రియా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. నాడు ‘ఇష్టం’తో మొదలైన ప్రస్థానం, నేటి “గౌతమీపుత్ర శాతకర్ణి” వరకు నిరంతరంగా సాగుతూనే ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ అందాన్ని పెంచుకుంటూ అవకాశాలు దక్కించుకుంటున్న శ్రియా శేరన్ గురించి బాలీవుడ్ నాట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోతో ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తోందన్నది లేటెస్ట్ టాక్. అయితే ఇదేదో ఆకతాయిగా వ్యక్తం చేస్తున్న పుకారు కాదు, ఏకంగా ఓ ఫోటోను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న శ్రియా – బ్రేవోల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్యా ఏం జరుగుతోందన్న విషయంలో అటు బ్రావో, ఇటు శ్రియ నోరు మెదపనప్పటికీ, ఏ స్థాయికి వీరి పరిచయం చేరుకుందో? అన్న ప్రశ్నపై పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఓ వైపు సినిమాలు తగ్గి ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్ లలో నృత్యాలు చేస్తూ కాలం గడుపుతున్న శ్రియ, తాజాగా బ్రావోతో సంబంధంపై ఏం చెబుతుందో? హీరోయిన్లు రొటీన్ గా ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చేస్తుందా? లేక ఎలాంటి సంచలన విషయాలైనా వెల్లడిస్తుందా? వీటికి సమాధానం కావాలంటే… శ్రియా పెదవి విప్పాల్సిందే..! అప్పటివరకు ఈ ఫోటోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.