Tension All Over as Live Proceedings Stopped in Andhra Pradesh Assembly Councilశాసనమండలిలో ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఏపీ శాసనమండలిలో టీడీపీ రూల్‌ 71ను తెర మీదకు తెచ్చి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పాడేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం రూల్ నెంబర్ 71వల్ల కలుగుతుంది. మండలిలో మెజార్టీ ఉంటే.. రూల్ నెంబర్ 71కింద తీర్మానం ప్రవేశ పెట్టవచ్చని తేలింది.

వెంటనే.. మెజార్టీని శాసనమండలి లెక్కించడంతో తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీకి బలం ఉందని నిర్ధారణ అయింది. దానితో మూడు రాజధానుల బిల్లు ప్రస్తుతానికి ఆగిపోయినట్టు అయ్యింది. దీనితో పద్నాలుగు మంది మంత్రులు పోడియంలోకి వచ్చి ఛైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరుదైన దృశ్యం మండలిలో ఆవిష్కృతం అయ్యింది.

ఇది ఇలా ఉండగా మండలి చైర్మన్ పార్టీలకి అతీతంగా వ్యవరించాలని… ఛైర్మన్ తన విచక్షణాధికారంతో రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించొద్దు.. ఇది మండలి ఛైర్మన్ పని తీరుకు మచ్చగా మిగిలిపోతుంది అంటూ చెప్పడం వివాదాస్పదం అయ్యింది. “నాకు రాజకీయాలను ఆపాదించవద్దు… నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను,” అని మండలి ఛైర్మన్ షరీఫ్ చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. “మండలి ఛైర్మన్ కు మంచి మాటే చెప్పారు బొత్స గారూ… అదే మాట స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు కూడా చెప్తే మంచిది,” అంటూ చాలా మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసెంబ్లీలోనూ బయటా స్పీకర్ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.