shock to ys jagan CBI Court Denies Permissionనాంపల్లి సీబీఐ కోర్టులో జగన్‌కు నిరాశ ఎదురయింది. పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్‌ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సీబీఐ ప్రత్యేకకోర్టు. కేసుల తీవ్రత నేపధ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయ్యీ సహకరించాల్సిందే అని తేల్చి చెప్పిన కోర్టు.

నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ తీర్పు నేపధ్యంలో కొంత ఇబ్బందే అని నిపుణులు భావిస్తున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై మిగిలిన రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చుకదా అని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డిని సీబీఐ కోర్టు ప్రశ్నించింది.

న్యాయస్థానాల మీద ఉన్న గౌరవంతోనే కోర్టు విచారణకు హాజరవుతున్నానన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవచ్చుకదా అని కోర్టు సూచించింది. పాదయాత్ర ప్రారంభించాక మధ్యలో కోర్టుకు వచ్చి హాజరవడం కష్టమవుతుందని, వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును మినహాయింపు కోరారు.

ఈ తీర్పుతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అవ్వడానికి జగన్ కు ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యనున్నారు. ఐతే ఈ బ్రేకులతో కూడిన పాదయాత్ర అంతగా ప్రభావం చూపదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు.