Shock Pratyusha Banerjee​'s last WhatsApp status “నేను మరణించిన తరువాత కూడా నిన్నే చూస్తుంటాను” (మర్ కే భీ మూహ్ నా తుజ్ సే మొదానా) అని ఉన్న ప్రత్యూష చివరి ‘వాట్స్ యాప్’ స్టాటస్ మెసేజ్ ని చూసిన వారి మనసులు బాధతో నిండిపోతున్నాయి. ప్రియుడు రాహుల్ రాజ్ తో వచ్చిన విభేదాల కారణంగానే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం నిగ్గు తేలడంతో కేసు విచారణ దశలో ఉంది.

ఇక, అంత్యక్రియలు బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. నిండైన వస్త్రధారణతో, పెద్ద బొట్టుతో రోజూ కనిపించే ప్రత్యూష, విగతజీవిగా కంటి ముందుండగా విలపించని వారు లేరు. ఆమె మృతదేహాన్ని కొత్త పెళ్లి కూతురుగా అలంకరించి మరీ సాగనంపడం విశేషం. పట్టుచీర కట్టి, అదే అలంకరణ మధ్య అంతిమ పయనం ప్రారంభం కాగా, వందలాది మంది అభిమానులు వెన్నంటే నడిచారు. ముంబైలోని ఓషివారా క్రిమెటోరియంలో ప్రత్యూష అంత్యక్రియలు ముగియగా, పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.