Bhabi Ji Ghar Par Hai - Shilpa Shindeబాలీవుడ్ బుల్లితెర నటి శిల్పా షిండేపై ‘సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ జీవితకాలం పాటు నిషేధం విధించింది. ‘భాభాజీ ఘర్ పర్ హై’ సీరియల్ తో ప్రజాదరణ పొందిన శిల్పా, ఈ సీరియల్ నుంచి అకస్మాత్తుగా తప్పుకోవాలనుకున్న నిర్ణయంపై మండిపడుతూ సదరు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బాలీవుడ్ టీవీ సీరియల్స్, షో లలో శిల్పా నటించడానికి జీవితకాలం పాటు అవకాశం లేకుండా పోయింది.

అయితే ఈ నిర్ణయంపై తానేమీ చూస్తూ ఊరుకోనని, పోరాటం చేస్తానని శిల్పా చెప్పుకొచ్చింది. ‘భాభాజీ ఘర్ పర్ హై’ సీరియల్ నిర్మాత బెనఫైర్ కోహ్లీ తనను మానసికంగా వేధించారని, అందుకే ఆ షో నుంచి తాను తప్పుకున్నానని వివరణ ఇచ్చుకుంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ‘సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిషేధం నిర్ణయం వెలువరించింది.