Sharwanand96 రీమేక్ సినిమా కోసం స్కై డైవింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి గాయాల‌య్యాల‌యి. షోల‌ర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. దీనితో ఆయనకు సోమవారం సర్జరీ అయ్యింది. రెండు నెలల పాటు బెడ్ రెస్టు చెప్పారు డాక్టర్లు. ఈ రోజు ఆయనకు చేసిన శాస్త్ర చికిత్సపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వాకు తగిలిన గాయం తీవ్రమైందని, దాదాపుగా పది గంటల పాటు శస్త్ర చికిత్స చెయ్యాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పుకొచ్చారు.

దుర‌దృష్ట‌వ‌శాతు థాయ్‌లాండ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో త‌న షోల్డ‌ర్ బోన్ ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఆ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా అయ్యింది. సీనియర్ డాక్టర్ల ఆధ్వ‌ర్యంలో నాలుగు గంట‌ల పాటు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. బోన్ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా ఉండ‌టం వ‌ల్ల చాలా టైం ప‌ట్టింది. అయితే ఆప‌రేష‌న్ స‌క్సెస్‌ను ఫుల్‌గా పూర్తి చేశాం. రైట్ షోల్డ‌ర్ కాబ‌ట్టి స్టిఫ్‌గా ఉంటుంది. మామూలుగా కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. రెండు నెల‌ల పాటు ఫిజియోథెర‌పీ చికిత్సను అందిస్తాం,” అని స‌న్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.గుర‌వారెడ్డి చెప్పారు.

“ఇది కాకుండా కాలిలో ఓ చిన్న ఫ్రాక్చ‌ర్ ఉంది. దీని గురించి పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఈరోజు ఐసియు నుండి రూమ్‌కు షిఫ్ట్ చేశాం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. ఈ రెండు గాయాలు త‌ప్ప‌.. మ‌రే స‌మ‌స్య‌లు లేవు. త‌ను త్వ‌ర‌గానే కోలుకుంటాడు,” అని ఆయన అన్నారు. దీనివల్ల దసరాకు విడుదల కావాల్సిన 96 రీమేక్ వాయిదా పడే అవకాశం ఉంది. ఆగష్టులో విడుదల కావాల్సిన రణరంగం సినిమాకు శర్వా ఇంట్లో ఉండే డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది.