sharwanand sudheer varma release date issueయంగ్ హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ ‘రణరంగం’ సినిమా షూటింగ్ పూర్తయినా, డేట్ దొరకక చిక్కుల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత ఈ సినిమా మే నెలలో వేసవి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు అయితే ఏమైందో ఏమో గానీ సినిమా పూర్తి చెయ్యకుండా 96 రీమేక్ షూటింగ్ మొదలు పెట్టేశాడు శర్వానంద్. ఆ తరువాత ఈ సినిమాని పూర్తి చేసి ఆగష్టు 5న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు అది సాధ్యపడేలా కనిపించడం లేదు.

జూలై 26న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత 15న సాహో వుంది. ఆగష్టు 30న నాని గ్యాంగ్ లీడర్ వస్తోంది. ఈ హడావిడి మధ్య మిగిలినవి రెండే డేట్ లు, ఆగస్టు 2వ తేదీ లేదా ఆగష్టు 23. ఆగష్టు 2న విడుదల చేస్తే ముందు వారం డియర్ కామ్రేడ్. వెనుక వారం మన్మధుడు 2 మధ్య ఇరుక్కు పోతుంది సినిమా . అందువల్ల ఈ డేట్ కు రావడం అనేది అనుమానం. అలా అని 23కు వెళ్లినా ప్రమాదమే.

ఆ డేట్ కు వస్తే ముందు వారం సాహో, వెను కవారం గ్యాంగ్ లీడర్ వుంటాయి. దీనితో ఏంచెయ్యాలో పాలు పోనీ స్థితిలో ఉంది చిత్ర బృందం. ఈ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలలో తక్కువ హైప్ ఉన్న సినిమా రణరంగమే. ఈ తరుణంలో మరో వాయిదా అంటే సినిమాకు ఇబ్బందే. ఎందుకనో శర్వానంద్ ఈ సినిమాను సరిగ్గా పట్టించుకోకుండా ఈ పరిస్థితికి ఆయన కారణమయ్యాడు. దీనితో హీరో కే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే అనుమానం ఉంది.