ranarangam-official-teaser-sharwanand-kajal-aggarwal-kalyani-priyadarshanయువ హీరో శర్వానంద్‌ నటిస్తున్న రణరంగం చిత్రం వచ్చే నెల 2న విడుదల కాబోతుంది. ఎందుకనో ఈ సినిమా మీద మొదటి నుండి ప్రేక్షకులలో ట్రేడ్ లో పెద్దగా అంచనాలు లేవు. శర్వానంద్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యకుండా 96 రిమేక్ మొదలు పెట్టడంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఏది ఏమైతేనేం ఈ సినిమాను ఆగష్టు 2న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చిత్రం రాక్షసుడు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇప్పుడు ఆ సినిమా ఆగష్టు 2కు వాయిదా పడింది. ఆగష్టు 1న అమెరికాలో ప్రీమియర్లు అంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. మరోవైపు ఆర్ఎక్స్ 100 తో అందరినీ ఆకట్టుకున్న కార్తికేయ తన తదుపరి చిత్రం గుణ 369 కూడా అదే రోజు విడుదల చెయ్యడానికి సిద్ధం చేస్తున్నారు. దీనితో శర్వానంద్ చిత్రానికి బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకు పోటీ భారీగానే ఉండబోతుంది.

తొలుత రణరంగం చిత్రం మే నెలలో వేసవి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు అయితే ఏమైందో ఏమో గానీ సినిమా పూర్తి చెయ్యకుండా 96 రీమేక్ షూటింగ్ మొదలు పెట్టేశాడు శర్వానంద్. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ లో శర్వానంద్ కొత్త స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. డైలాగులు కూడా బావున్నాయి. అయితే గతంలో సుధీర్ వర్మ చిత్రాల ట్రైలర్లన్నీ స్టైలిష్ గా ప్రామిసింగ్ గానే మొదట కనిపించేవి అయితే సినిమా విషయం వచ్చేటప్పటికీ ఫలితం తారుమారు అయ్యింది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.