Sharwanand Ranarangam Teaser Talkయువ హీరో శర్వానంద్‌ నటిస్తున్న రణరంగం చిత్రం టీజర్‌ కాసేపటి క్రితం విడుదలైంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవకర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌ కు జోడిగా కాజల్‌ అగర్వాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ నటిస్తున్నారు. టీజర్‌ లో శర్వానంద్‌ ను పూర్తిగా మాస్‌ పాత్రలో చూపించారు. ఈ సినిమాలో మాఫియా డాన్ దేవ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నట్టు టీజర్‌ ను బట్టి తెలుస్తోంది.

టీజర్‌లో.. దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. కానీ.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి అని శర్వానంద్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమయింది. కోపాన్ని దాహాన్ని ఇంకొకడు శాసించే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అంటూ శర్వానంద్‌ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కి హైలెట్ గా నిలిచాయి. శర్వానంద్ కొత్త స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. అయితే గతంలో సుధీర్ వర్మ చిత్రాల ట్రైలర్లన్నీ స్టైలిష్ గా ప్రామిసింగ్ గానే మొదట కనిపించేవి అయితే సినిమా విషయం వచ్చేటప్పటికీ ఫలితం తారుమారు అయ్యింది.

ఈ చిత్రన్ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జూలై 26న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనితో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకు పోటీ భారీగానే ఉండబోతుంది. తొలుత ఈ సినిమా మే నెలలో వేసవి కానుకగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు అయితే ఏమైందో ఏమో గానీ సినిమా పూర్తి చెయ్యకుండా 96 రీమేక్ షూటింగ్ మొదలు పెట్టేశాడు శర్వానంద్.