sharwanand decided to do pooja at srikalahasthi‘శర్వానంద్’ ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య శర్వా ఏ సినిమా చేసినా నష్టాలకు కేంద్ర బిందువు అవుతుంది. ఇప్పటికే వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడ్డ శర్వా.. ఎన్నో ఆశలతో చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కూడా సమర్థవంతంగా పరాజయం పాలైంది. మీడియం రేంజ్ హీరోల్లో ‘శర్వానంద్’ సాలిడ్ హీరోగా సెటిల్ అయ్యాడు అనుకుంటున్న టైంలో ఇలా ప్లాప్ ట్రాక్ ఎక్కడం ఈ హీరో జీర్ణయించుకోలేకపోతున్నాడు.

2018 లో ‘పడి పడి లేచె మనసు’ సినిమా నుంచి ప్లాప్ ల వలయంలో పడిన శర్వా.. ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, మహాసముద్రం వంటి ఘోర పరాజయాలు అందుకున్నాడు. తాజాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో మరో పరిపూర్ణమైన ప్లాప్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. పైన చెప్పుకున్న సినిమాలన్నింటికీ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Also Read – మార్పు ‘ఉనికి’ని ప్రశ్నిచకూడదుగా..?

అయితే, మంచి అంచనాలతో రిలీజ్ అయిన ప్రతి సినిమా చివరకు దారుణమైన అపజయాన్ని మూటకట్టుకుంది. హైప్ పెంచడం, డిజాస్టర్ కలెక్షన్స్ సాధించడం శర్వానంద్ కి కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పటికే ఆడవాళ్లు మీకు జోహార్లు కలెక్షన్స్ విషయంలో చేతులెత్తేసింది. ఫైనల్ గా ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీగానే లాస్ కనిపిస్తుంది. రిలీజ్ కి ముందు సినిమా హిట్ గ్యారెంటీ అని నమ్మడం, తీరా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాక ఫీల్ అవ్వడం శర్వానంద్ కి కూడా అలవాటు అయిపోయింది.

మరోపక్క శర్వానంద్ కథల ఎంపిక ఏ మాత్రం బాగాలేదు అని అతని పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. కానీ, వాస్తవానికి పైన చెప్పిన చిత్రాలన్నీ శర్వా పూర్తి మనసు పెట్టి చేసాడు. ‘పడి పడి లేచె మనసు’ సినిమా విషయంలో ఓవర్ బడ్జెట్ అవుతున్నా.. నిర్మాతలను ఒప్పించి మరీ ఆ సినిమా చేశాడు. ఇక ‘రణరంగం’ విషయంలో అయితే.. రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని లాభాల్లో షేర్ కూడా ముందే మాట్లాడుకున్నాడు.

Also Read – రికార్డు అదిరింది..మరి లైన్-అప్..?

ఇక జాను విషయానికి వస్తే ఏరికోరి చేసిన సినిమా ఇది. అలాగే ‘శ్రీకారం’ కథ తనకు ఎంత గొప్పగా నచ్చకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడు. మహాసముద్రం పై శర్వా పెట్టుకున్న ఆశల గురించి, ఆ సినిమా రిలీజ్ సమయంలో చేసిన హడావుడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను కూడా శర్వా అంతకంటే ఎక్కువ నమ్మాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు.

మనసు పెట్టి చేసిన సినిమాలన్నీ ఇలా చేదు అనుభవాలను మిగల్చడంతో శర్వానంద్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యాడు. అదేంటో తన ప్రతి సినిమా రిలీజ్ కి ముందు హిట్టు చేతికందినట్టే అంది.. మిస్ అయిపోతుందని శర్వా ఎక్కువ ఫీలవుతున్నాడు. అందుకే, త్వరలో కాళహస్తిలో రాహు కేతువు పూజ కూడా చేయించుకోవాలని ఈ హీరో డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Also Read – డాడీ నన్ను కొట్టారు… అరెస్ట్ చేయండి!