షర్మిలకు పదవితో పాటు ఆస్తి కూడా ఇవ్వలేదా?దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. అన్న తో తనకు విబేధాలు ఉన్నాయో లేక భేదాభిప్రాయాలు ఉన్నాయో తెలీదని ఆమె వారి మధ్య జరిగింది చెప్పకనే చెప్పారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని.. షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడింది,” అని ఆయన కర్నూల్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. షర్మిలకు జగన్ పదవి ఇవ్వక ఆమె పార్టీ పెట్టారు అనే విషయం ప్రచారంలో ఉన్నదే అయితే ఆస్తులు ఇవ్వలేదు అనేది కొత్త యాంగిల్ అని చెప్పుకోవాలి.

జగన్ పిరికి పంద అని… ఆయనకు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు చంద్రబాబు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు.

మరోవైపు… షర్మిల ఏప్రిల్ 9న పార్టీని ప్రకటించి మే మొదటి వారంలో కొత్త పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేయడం వెనుక కారణం ఉంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది. 60 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేశారు.