Shankar reveals VFX issues of Rajinikanth 2.0 Movie రోబో 2.0 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా హడావిడి చెయ్యడానికి సిద్దం అయిపోయింది. ఇక మన టైమ్ ప్రకారం ఈరోజు సాయంత్రమే యూఎస్లో ప్రిమియర్ షోస్ పడిపోనున్నాయి. అంటే మనం నిద్రలోకి జారుకునే లోపే రోబో సినిమా సంచలన ప్రయాణం మొదలవనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తాజా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా కొన్ని వేల మంది కష్టం అని చెప్పారు. అయితే ఆ వేల మంది కష్టాన్ని మరోమారు పూస గుచ్చినట్లు వివరించారు ఈ సినిమా వీ.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైసర్ కమ్ వీ.ఎఫ్.ఎక్స్ ప్రొడ్యూసర్ శ్రీనివాస మోహన్. ఇక ఈయనే మన బాహుబలికి కూడా వీ.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైసర్ గా వ్యవహరించింది కూడా.

ఒక ప్రఖ్యాత యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఈ వీ.ఎఫ్.ఎక్స్ విషయంలో వారు తీసుకున్న జాగ్రత్తలు, పడిన కష్టం గురించి క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా స్క్రిప్ట్, ఆయా పాత్రలు, ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలకు వీ.ఎఫ్.ఎక్స్ అద్దిన తీరు ఇలా అన్ని విషయాలను క్లుప్తంగా అర్ధం అయ్యేలా వివరించారు శ్రీనివాస్ మోహన్. అయితే బడ్జెట్ కి సంభందించి తొలి పార్ట్ రోబో కి ఈ పార్ట్ రోబో 2.0 కి ఎందుకంత తేడా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రోబో విషయంలో తమకు బాగా లిమిటేషన్స్ ఉన్నాయి అని, అయితే రోబో 2.0 కి ఆ ప్రాబ్లమ్ లేదు అని, పైగా రోబో తొలి భాగంలో బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల కధలోనే మార్పులు చేసుకున్నాం అని ఎందుకంటే, రోబో పాత్రకి జుట్టు పెట్టడం, కళ్ళు డిజైన్ చెయ్యడం, చాలా కష్టం అని పైగా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని, అయితే ఆ సినిమాలో దాన్ని కవర్ చెయ్యడానికి కళ్ళు డిజైన్ కోసం ఖర్చుపెట్టడానికి బడ్జెట్ ప్రాబ్లమ్ అవుతుంది అని రోబో కి కళ్ళద్దాలు తగిలించాం. జుట్టు కూడా ఎక్కువగా పెడితే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో సింపిల్ గా రెండు, మూడు వెంట్రుకలు ఉండేలా చూశాం. ఇక మరో పక్క బట్టల విషయంలో కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసి ఇబ్బంది కలగకుండా చేశాం.

అందుకే ఆ జుట్టు, కళ్లద్దాల విషయంలో కాంప్రమైస్ అవ్వడం వల్లనే దాదాపుగా 50% బడ్జెట్ మాకు అక్కడే తగ్గిపోయిందీ అంటూ షాకింగ్ మ్యాటర్ చెప్పారు శ్రీనివాస్. అంటే ఈ లెక్కన రజనీకాంత్ జుట్టు, కళ్ళద్దాలు ఎన్ని కోట్ల విలువైనవో అర్ధం అవుతుంది.