Shankar Ready Robo 2.0 movie another sequel వామ్మో…వయ్యో అసలు ఎక్కడ నుంచి వస్తుంది డైరెక్టర్ శంకర్ కి అంత ఓపిక. ఒక పక్క రోబో సినిమాతో రెండు ఏళ్లు గడిపేశాడు. ఆతర్వాత చియాన్ విక్రమ్ తో హిట్ ఫ్లాప్ సంభంధం లేకుండా ఐ సినిమాతో మరి కొంత కాలం గడిపేశాడు. ఇక తాజాగా మరో రెండు రోజుల్లో విడుదల కానున్న రోబో సినిమా సీక్వెల్ రోబో 2.0 తో ఒక రెండు ఏళ్లకు పైగానే సినిమా తీసి ఇప్పుడు దాన్ని హాట్ కేక్ లా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ముచ్చట్లలో భాగంగా ఈ సినిమా కి మరో సీక్వెల్ ఉంటుందా అని పొరపాటున అడిగిన ప్రశ్నకు రజని సార్ సై అనాలే కానీ, నేను రెడీ అంటున్నాడు శంకర్. అంటే అన్నీ కుదిరితే రోబో 3.0 కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అయితే ఇక్కడ చిన్న మ్యాటర్ ఏంటి అంటే రజనీకాంత్ కి వయసు పై బడుతూ ఉంది. ఇలాంటి రిస్కీ సినిమాలు, పైగా రెండు మూడు ఏళ్లు పట్టే సినిమాలు ఇంక చెయ్యడం మంచిది కాదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక వేళ పొరపాటున ఈ సినిమా కి మూడో భాగంగా సినిమా తెరకెక్కించాలి అని అనుకున్నా అది రావడానికి మరో రెండు నుంచి మూడు ఏళ్లు కనీసం పడుతుంది. మరి ఈ క్రమంలో కధ సిద్దంగా ఉంది అంటున్న శంకర్, ఒకవేళ రజని కాదు అంటే ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ ను వేరే హీరోతో తెరకెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పైగా మనం ఇంగ్లీష్ సినిమాల సీక్వెల్స్ ను చూస్తూనే ఉన్నాం, జేమ్స్ బాండ్, స్పైడెర్ మ్యాన్, అలా చాలా సినిమాలు సీక్వెల్స్ తో అలరిస్తున్నాయి.

మరి శంకర్ కూడా అదే బాటలో పయనించి రోబో సినిమా సీక్వెల్స్ ని కొనసాగిస్తాడేమొ చూడాలి. అయితే ఇక్కడ కలసి వచ్చే అంశం ఏంటి అంటే, ఇంగ్లీష్ సినిమా సీక్వెల్స్ అన్నింటిలో ఒకే హీరో ఉండడు. అలాగా ఇక్కడ ఒకవేళ తలైవార్ కి చేసే అవకాశం లేకపోతే అక్కడలాగా వేరే హీరోతో ట్రై చేసినా కంటెంట్ బావుంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. మరి మైండ్ లో చాలా ఐడియాస్ ఉన్నాయి అంటున్న శంకర్ ఈ రోబో జైత్ర యాత్రని ఎలా ముందుకు తీసుకు వెళతాడో చూద్దాం.