shankar ramcharn movie updateసంచలన దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు సిద్ధం చేస్తున్నాడు. స్టోరీ తనదే కాగా… వివేక్‌ అనే యువ రైటర్ తో కలిసి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్లు రాస్తున్నారని సమాచారం.

వివేక్ ఒక గీత రచయిత. తమిళ ఇండస్ట్రీలో మెర్సల్, బిగిల్, దర్బార్, ఇరుంబు తిరాయ్, సూరరై పొట్రు, జగామే తందిరం వంటి చిత్రాలకు పాటలు రాశాడట. ఇక పోతే… జూన్ / జూలై 2021 నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని బజ్ ఉంది. అయితే ఇది కరోనా పరిస్థితులు అనుకూలిస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శంకర్ ఈ చిత్రాన్ని ఆరు నెలల ఏకధాటి షెడ్యూల్‌లో పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. శంకర్ ఇప్పటిదాకా అంత త్వరగా ఒక సినిమా తీసింది లేదు. ఒక పాటనే నెలరోజులు షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రీమేక్ సినిమా చేసినప్పుడు కూడా అంత స్పీడ్ గా తీయలేదు శంకర్.

కాబట్టి దీనిని మెగా అభిమానులే కాదు ఆయన అభిమానులు కూడా నమ్మడం లేదు. అయితే శంకర్ గత సినిమాల్లో లాగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత ఉండదని అందుకే అది సాధ్యపడుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా కోసం కియారా అద్వానీ ని హీరోయిన్ గా అనుకున్నారట. ఈ చిత్రం విడుదలైన తరువాత శంకర్ రణ్‌వీర్ సింగ్ (అన్నీయన్ రీమేక్) తో తలపెట్టిన మరో ప్రాజెక్టు కు వెళ్తాడు.