Shankar---2.0-Press-Meetమరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న రోబో-2.0 ప్రమోషన్ లో భాగంగా ఒక చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రెస్ మీట్ లో అటు దర్శకుడు శంకర్, ఇటు రజని ఇద్దరూ తెలుగు మాట్లాడటం విశేషంగా చెప్పవచ్చు. ఇక సినిమా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే, మరో పక్క సినిమా పేరు చెప్పి ప్రొడ్యూసర్ గారు ఊరికినే డబ్బు వేస్ట్ చేస్తున్నారు అంటూ రజనీకాంత్ జోక్స్ వెయ్యగా, అదే క్రమంలో ఎనిమిది ఏళ్ల క్రితం విడుదల అయిన రోబో ఫంక్షన్ లో శంకర్ ఇంగ్లీష్ లో మాట్లాడాడు అంటూ శంకర్ పై ఛలోక్తులు సైతం విసిరారు.

ఇక ఈ సినిమా గురించి శంకర్ మాటాడుతూ ఈ సినిమా కొన్ని వందల, వేల మంది కష్టం అని, ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ ఎంత కష్టపడ్డారో, ఆరోగ్యం సహకరించక పోయినా ఆయన ఎంతగా సపోర్ట్ చేసారో చెబుతూనే, మరో పక్క విలన్ పాత్రలో అక్షయ్ పడ్డ పాట్లు గురించి, ఆయన మేకప్ గురించి కూడా చెబుతూ ఈ సినిమా ఎంత కృషి చేస్తే బయటకు వచ్చిందో తెలిపారు. మరో పక్క మీడియా వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అంటూ శంకర్, ఈ సినిమాకు సపోర్ట్ చెయ్యండి. మీరు సపోర్ట్ గా నిలిస్తే ఇండియన్ సినిమా స్థాయి పెరుగుతుంది. నిజంగా ఇంత భారీ ఖర్చు పెట్టి ఇండియన్ సినిమా తియ్యగలం అని మన కూడా ప్రపంచానికి చూపించవచ్చు అని అన్నారు. అదే క్రమంలో షూటింగ్ టైమ్ లో అక్కడి వాతావరణ పరిస్థితులు, వారు పడ్డ ఇబ్బందులు. షూటింగ్ ఆపెయ్యాల్సి వచ్చి కూడా అలా జరిగితే ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో అని ఆలోచించుకుని ముందుకు సాగిన తీరును శంకర్ అందరికీ వివరించారు. అంతేకాదు భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అన్న ఆలోచనలో నుంచి పుట్టిన కధగా ఈ సినిమాను అభివర్ణించారు శంకర్.

మొత్తంగా మరో రెండు రోజుల్లో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపడానికి వస్తున్న రోబో వెనుక ఎలాంటి కష్టం ఉందో అందరికీ ఆర్ధం అయ్యేలా వివారించారు శంకర్. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటే రెండు రోజులు ఆగాల్సిందే.