Shalini Pandey next movie with mahesh babuవిజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన షాలిని పాండే, ఇప్పటివరకు మరో తెలుగు సినిమా చేయలేదు. మరోవైపు “100% లవ్” తమిళ రీమేక్ లో తళుక్కుమంటున్న ఈ హీరోయిన్ కు ఊహించని బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే తదుపరి సినిమాలో రెండవ హీరోయిన్ గా షాలిని పాండేకు అవకాశం లభించినట్లు లేటెస్ట్ టాక్.

ప్రిన్స్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డేను ఒక హీరోయిన్ గా ఖరారు చేయగా, తాజాగా షాలిని ఎంపిక జరిగినత్లుఆ సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకోబోతున్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు మరియు మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మించబోతున్నారు.