shakeela-sheelavathi-transformation-impact-geethaకొత్తదనం కావాలని ప్రేక్షకులు పరితపిస్తున్న రోజులివి. స్టార్ హీరోలతో సంబంధం లేకుండా నూతన కధలతో వస్తున్న చిన్న చిత్రాలకు సైతం భారీ స్థాయిలో ప్రేక్షకులు పట్టాభిషేకం చేస్తున్నారు. ‘అవుట్ డేటెడ్’ నటినటులను గానీ, ‘అవుట్ డేటెడ్’ కధలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఈ రోజుల్లో…. ఒకప్పటి మలయాళ సినీ పరిశ్రమను ఊపేసిన షకీలా “శీలవతి” అనే పేరుతో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను విడుదల చేసారు. ‘తనకు సంతానం కావాలంటూ’ షకీలా చెప్పిన డైలాగ్స్ తో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులలో ఎలాంటి ఆసక్తిని కలిగించకపోగా, ఇలాంటి సినిమాలు ఈమెకు అవసరమా? అన్న భావన కూడా వీక్షకులలో వ్యక్తమవుతుంది. టైటిల్ రోల్స్ ను వదిలేసి, క్యారెక్టర్ రోల్స్ ను ఎంపిక చేసుకుంటే ఒకటికి పది సినీ అవకాశాలు వస్తాయేమో గానీ, ఈ పరిస్థితులలో కూడా టైటిల్ రోల్స్ చేయడం ఎంతవరకు సమంజసమో షకీలానే అర్ధం చేసుకోవాలి.