Shakalaka Shankar overactionతాను హీరోగా నటించిన సినిమాకు పబ్లిసిటీ చేయాలని భావించారో లేక తనకు సినిమా చేసిపెట్టమని అడిగితే చేయలేదని టాలీవుడ్ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారో గానీ, షకలక శంకర్ చేస్తోన్న వ్యాఖ్యలు మరీ శృతిమించుతున్నాయనే టాక్ టాలీవుడ్ లో వినపడుతోంది. ఇటీవల త్రివిక్రమ్, రవితేజ, దిల్ రాజులపై చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారిన శంకర్, తాజాగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలయ్య అండ్ కోలపై చేసిన వ్యాఖ్యలతో నవ్వులు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో… జనసేన పార్టీలోకి ఒక్క రోజా మాత్రమే కాదు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా ఈ పార్టీలోకి వచ్చేయాలని వారంతా పవన్ కళ్యాణ్ కోసం కష్టపడాలని, అంతేందుకు బాలయ్య బాబు కూడా ఈ పార్టీలోనే జాయిన్ అవ్వాలి అంటూ హాస్యాస్పదనమైన వ్యాఖ్యలు చేసి నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నారు. ఇలాంటి మనిషి మరొకరు ఉండరంటూ పవన్ కళ్యాణ్ ను కొనియాడిన శంకర్, వీళ్ళందరికీ ఎప్పటికి అర్ధమవుతుందో… అంటూ చెప్పుకొచ్చారు.

వాళ్ళు మాత్రమే కాదు, జగన్ గారు కూడా పవన్ కు సపోర్ట్ చేయాలని చెప్పడం…, ఇండియా మొత్తం వచ్చి పవన్ వెంటే నడవాలని చెప్పడం… శంకర్ మానసిక స్థితికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. తమ అభిమాన హీరోపై పొగడ్తలు చేయడంలో తప్పులేదు గానీ, మరీ శృతిమించిన వ్యాఖ్యలు చేయడం మాత్రం శంకర్ ను హాట్ టాపిక్ గా మార్చేస్తున్నాయి. హీరోగా ఎలాంటి విన్యాసాలు చేసారో ఇప్పుడే చెప్పలేం గానీ, కమెడియన్ గా తన పరిధిని మించి నవ్వులు కురిపించడంలో సక్సెస్ అవుతున్నారు.