Shailaja-Reddy-Alludu-Teaserమనుషులకున్న బలహీనలతో వినోదాన్ని అందించడం మారుతీ బ్రాండ్ గా మారింది. ఇప్పటికే మతిమరపు, అతిశుభ్రతలతో “భలే భలే మగాడివోయ్, మహానుభావుడు” వంటి కమర్షియల్ హిట్స్ కొట్టిన మారుతీ, ఈ సారి “ఈగో”తో ప్రేక్షకులను అలరించడానికి “శైలజారెడ్డి అల్లుడు” ద్వారా రాబోతున్నారని టీజర్ స్పష్టం చేస్తోంది.

హీరోయిన్ అను ఇమ్మానుయెల్ ‘నువ్వు ఐ లవ్ యు అని ప్రొపోజ్ చెయ్, నేను ఐ లవ్ యు టూ అని ఒక చేస్తా’ అంటూ చెప్పిన ఈగో డైలాగ్ బాగా పండింది. డిఫరెంట్ లుక్ నాగచైతన్య ఉండగా, అత్త గారి పాత్రలో మరోసారి రమ్యకృష్ణ తన అభినయాన్ని ప్రదర్శించనుంది. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

అయితే ఈ “ఈగో” సబ్జెక్ట్ ను ఇప్పటికే చాలా సినిమాలలో ఉపయోగించడంతో, మారుతీ ఎలా డీల్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈగో సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా ‘ఖుషీ’ మూవీ నిలువగా, ఆ తర్వాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ కూడా అందుకు సీక్వెల్ గా నిలిచింది. చూడబోతుంటే మారుతీ మార్క్ వినోదం గ్యారెంటీ ఏమో అన్న నమ్మకాన్ని టీజర్ కలిగించింది.