Shailaja-Reddy-Alludu-Movie-Latestఆగష్టు 31వ తేదీన విడుదల కావాల్సిన మారుతి – నాగ చైతన్యల “శైలజారెడ్డి అల్లుడు” సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆగష్టు 31వ తేదీ నుండి విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సెప్టెంబర్ 13వ తేదీకి మార్చినట్లుగా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసి ధృవీకరించారు. అలాగే కింగ్ పుట్టినరోజు సందర్భంగా ధియేటిరికల్ ట్రైలర్ ను బుధవారం నాడు రిలీజ్ చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు.

ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనకు కొద్ది నిముషాల ముందే సమంత ప్రధాన పాత్రలో నటించిన “యూ టర్న్” సినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ఖరారు చేసారు. దీంతో సెప్టెంబర్ 13వ తేదీన రియల్ భార్యభర్తలు, రీల్ తో విడివిడిగా పోటీపడబోతున్నారు. భర్త ఎంటర్ టైన్మెంట్ తో వస్తుంటే, ప్రేక్షకులను థ్రిల్ కలిగించేందుకు సతీమణి సిద్ధమైంది. వినాయకచవితి రోజు విడుదల కానున్న ఈ సినిమాలలో విజేతగా ఎవరు నిలుస్తారో?