shailaja-reddy-alludu-egiregire-video-songమారుతీ దర్శకత్వం వహిస్తోన్న “శైలజ రెడ్డి అల్లుడు” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఇటీవల గోవాలో నాగచైతన్య – అను ఇమ్మానుయెల్ మధ్యన చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గా బాగుంది. గోవా తీరాలలో షూట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ ను సిడ్ శ్రీరాం ఆలపించాడు.

‘గీత గోవిందం’ సినిమాలో ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటతో మారుమ్రోగుతున్న శ్రీరామ్ స్వరం, వెనువెంటనే ఈ ‘ఎగిరేగిరే’ పాటతో మళ్ళీ వచ్చేసింది. వీడియో ప్రోమో 41 సెకన్లే ఉన్నప్పటికీ, విజువల్ తో పాటు లిరికల్ పరంగా బాగుంటుందన్న అనుభూతిని కలిగించింది. గోపి సుందర్ సంగీతం అందించగా, కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు.