Shailaja-Reddy-Alludu-Collections-BOఅక్కినేని అభిమానులంతా గ్యారెంటీ హిట్ అనుకుని వెళ్ళిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు మిశ్రమ స్పందనలు లభించిన విషయం తెలిసిందే. సినీ విశ్లేషణలకు తోడుగా మౌత్ టాక్ కూడా ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, తొలిరోజు మాత్రం బంపర్ వసూళ్ళను అందుకోవడం అభిమానులను ఉత్సాహపరిచింది.

అయితే రెండవ రోజు పోకడను చూస్తే… మొదటి రోజు సాధించిన వసూళ్ళను చూసి మురిసిపోవాల్సిందేనా? అన్న సందేహాలను ట్రేడ్ పండితులు వ్యక్తపరుస్తున్నారు. తొలిరోజు చైతూ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా “శైలజారెడ్డి అల్లుడు” నిలిచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, అందుకనే చైతూ కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కానీ రెండవ రోజు బుకింగ్స్ కు, మొదటి రోజు కలెక్షన్స్ కు ఎక్కడా పొంతన లేదన్న లెక్కలు అందుతున్నాయి. అంతేగాక మరోవైపు “యూ టర్న్” సినిమాకు పాజిటివ్ టాక్ లభించడం కూడా ఈ సినిమాను దెబ్బతీసింది. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలేవీ లేకపోవడం ‘శైలజారెడ్డి అల్లుడు’కు కలిసోస్తుందేమో ఈ వీకెండ్ వరకు చూడాలి.