shailaja-reddy-alludu-choode-songఈ నెల 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న మారుతి – నాగచైతన్యల “శైలజరెడ్డి అల్లుడు” సినిమా నుండి రెండో పాట విడుదలైంది. ‘జంజం బల్ బరి జాతరచూడే’ అంటూ మొదలయ్యే ఈ పాటకు గోపిసుందర్ సంగీతం అందించగా, సత్యవతి (మంగ్లి) వాయిస్ ఈ పాటకు హైలైట్ గా నిలిచింది.

‘అంటుకుపోతే ఆంటీకి కోపం… బిగుసుకుపోతే బ్యూటీకి కోపం… సన్ ఇన్ లానే సాండ్ విచ్ పాపం ఇరుక్కుపోయిండే ఈ పోరడు మెషిన్ లో చెరుకైండే…’ అంటూ కసర్ల శ్యాం అందించిన క్యాచీ లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అల్లుడు తిప్పలను చాటే ఈ పాట వినసొంపుగా అందించడంలో గోపి సుందర్ + మంగ్లి + శ్యాంలు సూపర్ సక్సెస్ అయ్యారు.