shailaja-reddy-alludu-anu-baby-video-songఈ నెల 31వ తేదీన “శైలజా రెడ్డి అల్లుడు” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్య, ముందుగా ‘అను బేబీ’ అంటూ ఓ పాటేసుకుంటూ వచ్చాడు. హీరోయిన్ అను ఇమ్మానుయెల్ ను టీజ్ చేస్తూ సాగిన ఈ సాంగ్ బాగుంది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ బీట్ మొదటిసారికే ఎక్కేస్తుంది, అలాగే కృష్ణకాంత్ లిరిక్స్ క్యాచీగా ఉండగా, చిత్రీకరణ కూడా బాగుంది.

న్యూ లుక్ లో నాగచైతన్య కనిపిస్తుండగా, ‘నా పేరు సూర్య’ వంటి భారీ సినిమా తర్వాత ఈ ఏడాది అను ఇమ్మానుయెల్ మరోసారి టాలీవుడ్ తెరను పలకరించబోతోంది. మాంచి జోష్ ఫుల్ సాంగ్ తో ప్రారంభమైన ప్రమోషన్స్ మరో వారంలో మరింత ఊపందుకోనున్నాయి. టైటిల్ రోల్ అయిన ‘శైలజా’ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా, దర్శకుడిగా వరుస సక్సెస్ లతో ఊపుమీదున్న మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.