Shah Rukh Khan  Car Ran Over A Photographer Foot‘డియర్ జిందగీ’ సినిమాలో తనతో పాటు నటించిన అలియా భట్ జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు షారుఖ్. దీంతో ఎప్పట్లాగానే షారుఖ్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఈ సందర్భంలో షారుఖ్ కారు వేగంగా వస్తున్నప్పటికీ… దాన్ని పట్టించుకోకుండా ఓ ఫోటోగ్రాఫర్ షారుఖ్ ను ఫోటో తీసే పనిలో పడ్డాడు. దీంతో షారుఖ్ కారు సదరు ఫొటోగ్రాఫర్ కాలిపై నుంచి వెళ్లిపోయింది.

దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే కారు నుంచి దిగి వచ్చాడు. వెంటనే తన బాడీగార్డును తోడు ఇచ్చి, సదరు ఫోటోగ్రాఫర్ ను నానావతి ఆసుపత్రికి తరలించాడు. వైద్యానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని… అతనికి పూర్తిగా బాగా అయ్యేంత వరకు తానే చూసుకుంటానని షారుఖ్ ఈ సందర్భంగా తెలిపాడు. షారుఖ్ గొప్ప మనసును చూసి అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు.