Shah Rukh Khan Cameo in Salman Khan Tubelightవరుస హిట్లు మీద హిట్లు అందుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం “ట్యూబ్ లైట్” విడుదలైంది. ప్రాధమికంగా లభిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందన్న టాక్ వెలువడింది. దీనికి సినిమాకు సంబంధించి హైలైట్ సన్నివేశంగా భావించిన సల్మాన్ – షారుక్ ల కలయిక సీన్ ఆన్ లైన్ లో లీక్ కావడం, సినిమాకు మరో పెద్ద దెబ్బగా మారింది.

విడుదలకు ముందు వరకు సీక్రెట్ గా ఉంచిన ఈ విషయంతో, ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేద్దామని భావించిన సల్మాన్ ఖాన్ కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. షారుక్ – సల్మాన్ కాంభినేషన్ లో వచ్చిన సన్నివేశం మొత్తం రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో, అది కాస్త వైరల్ అయ్యింది. ఇంద్రజాలికుడిగా షారూఖ్ నటించగా, సల్లూ భాయ్ అతనిని అనుకరించే ప్రయత్నం చేసే ఈ సన్నివేశం అభిమానులకు కన్నులవిందుగా మారింది.

ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఖాన్స్ మధ్య తర్వాత విభేదాలు తలెత్తడంతో చాలా ఏళ్ళ పాటు దూరంగా ఉన్నారు. కానీ, సల్మాన్ తన చెల్లెలు అర్పిత పెళ్లికి షారుక్ ను ఆహ్వానించినప్పటి నుంచీ ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి జోడీ సినిమాకు కీలకం కానుందని సల్మాన్ భావించి, సీక్రెట్ గా ఉంచగా, అది కాస్త సోషల్ మీడియాలో లీకై సినీ అభిమానులకు కిక్ ను తగ్గించింది.