Dil-Raju makes to wait Shaadi Mubaarak Director Padmasriటాలెంట్ ఉన్న వాళ్ళను వెతికి పట్టుకోవడంలో ‘దిల్ రాజు’కి మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా సాంకేతిక నిపుణుల విషయంలో ‘విషయం ఉన్న టెక్నీషియన్’ లను దిల్ రాజు అస్సలు వదిలిపెట్టదు. దీనికితోడు దిల్ రాజు బ్యానర్ లో పని చేయాలని సినిమా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ ఉత్సాహ పడుతూ ఉంటాడు. ఆ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడంలో దిల్ రాజు కూడా ఆరితేరిపోయాడు.

పైగా ఒక డైరెక్టర్ కథ తీసుకుని వస్తే.. ఆ కథ పైనే ఏడాది కుర్చోపెడతాడు. మళ్ళీ మధ్యమధ్యలో తన కాంపౌండ్ లో అవకాశాల కోసం పడి ఉన్న నూతన దర్శక బృందాన్ని ఆ కథ పైకి వదులుతాడు. వాళ్ళంతా అప్పటికే తమ కథల్లో నలిగిపోతూ అనాసక్తిగా ఉంటారు. దాంతో వాళ్లు ఆ కథ పై కూడా అనాసక్తిగానే పని చేస్తారు. దీనికి తోడు ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెబుతారు.

అన్నిటికీ మించి.. ఒకరు చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానికి, ఏ మాత్రం పొంతన ఉండదు. చివరకు ఏడాది పాటు కూర్చుని కథ చేసిన దర్శకుడికి ఆ కథ పై నమ్మకం పోతుంది. నేరేషన్ కూడా ఎఫెక్టివ్ గా ఇవ్వలేడు. ‘కథే కరెక్ట్ గా చెప్పలేకపోతున్నావ్, సినిమా ఏమి తీస్తావ్.. ఇంకా నువ్వు కథ పై వర్క్ చేయాలని దిల్ రాజు సింపుల్ గా తేల్చేస్తాడు. మళ్లీ మరో ఆరు నెలలు అదే కథ పై ఆ దర్శకుడు కుస్తీ పడతాడు.

కుస్తీ పట్టి, కసరత్తులు చేశాక, మళ్ళీ ఆ నూతన దర్శక బృందం వస్తోంది. కథ పై నమ్మకాన్ని పోగొడుతుంది. దిల్ రాజు సినిమాని మళ్లీ పోస్ట్ ఫోన్ చేస్తాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి విషయంలో అచ్చం ఇదే జరుగుతుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరేంటే.. పేరు ‘పద్మశ్రీ’. ఆ మధ్య ‘షాదీ ముబారక్’ అంటూ చక్రవాకం సీరియల్ హీరో సాగర్ హీరోగా ఒక సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.

‘షాదీ ముబారక్’ సినిమా బాగుందని మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పైగా ఈ సినిమాని రిలీజ్ చేసింది కూడా దిల్ రాజునే. ఈ సినిమా తనకు కూడా నచ్చడంతో దిల్ రాజు, దర్శకుడు పద్మశ్రీకి అడ్వాన్స్ ఇచ్చి కథ పై వర్క్ చేయమన్నాడు. కథ పై వర్క్ చేయడం మొదలు పెట్టి రెండు ఏళ్ళు కావస్తోంది. అయినా ఈ సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. ఈ లెక్కన దర్శకుడు పద్మశ్రీకి మరో ఏడాది వరకు ఎదురుచూపులు తప్పవు ఏమో.