Dubagunta Rosamma, Senior NTR Fan Dubagunta Rosamma Died, Dubagunta Rosamma Died, Dubagunta Rosamma Passed Away, Dubagunta Rosamma Diesదూబగుంట రోశమ్మ… 1990 దశకంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి ‘మద్య నిషేధాన్ని’ డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించిన వర్దినేని రోశమ్మ. ఆనాటి ఉద్యమం రోజురోజుకూ పెరిగి ఉవ్వెత్తున లేవగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ ప్రభావితమై, తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీని అమలు చేశారు కూడా! రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె ఇంటి పేరును దూబగుంటగా మార్చేసింది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తన 93 ఏళ్ల వయసులో మరణించారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే శక్తి లేక వైద్యానికి దూరమైన ఆమె, రెండు రోజులుగా ఆహారం తీసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.