selfie-raja‘సుడిగాడు’ విజయం తర్వాత ‘సడెన్ స్టార్’గా మారిపోయిన కామెడీ హీరో అల్లరి నరేష్, అప్పటినుండి సక్సెస్ కోసం మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిట్ అనే మాట విని చాలా కాలం గడిచిన నరేష్ తాజాగా ‘సెల్ఫీ రాజా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన తండ్రి ఇవివి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా, టీజర్ ను కూడా విడుదల చేసారు.

భారీ డైలాగ్ తో ఓపెన్ అయిన టీజర్ లో అల్లరి నరేష్ రొటీన్ మార్క్ సన్నివేశాలు కనపడుతున్నాయి. అలాగే టైటిల్ జస్టిఫికేషన్ గా నరేష్ ‘సెల్ఫీ’ల సందడి టీజర్లో స్పష్టంగా చూపించారు. టీజర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, విజయం కోసం పరితపిస్తున్న నరేష్ కు ఆ రేంజ్ సక్సెస్ ను ఇస్తుందని ఆశిద్దాం. అన్నట్లు… టీజర్ మధ్యలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ అలా తళుక్కుమని, కామెడీ గ్యారెంటీ అన్న నమ్మకాన్ని కలిగించారు.