Sekhar Kammula - Naga -Chaitanya Akkineni Movieఫీల్ గుడ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల-హీరో నాగచైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి నాగచైతన్య ఏకంగా బల్క్ డేట్ కు కేటాయించాడు. దీనితో సినిమాను ఏకబిగిన షూట్ చేసి, డిసెంబర్ చివరివారంలో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు చిత్రనిర్మాతలు.

అయితే ఫిదా తరువాత శేఖర్ కమ్ముల కొత్త హీరో హీరోయిన్లతో ఒక సినిమా తీశారు. ఆ సినిమా గురించి వారు వీరు రాయడమే తప్ప ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించింది ఏమీ లేదు. ఆ సినిమా హీరో హీరోయిన్లు కూడా ఎవరో తెలీదు. అసలు ఆ సినిమా గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఈ సినిమా గురించి హడావిడి చెయ్యడం ఏంటో అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఆ సినిమా ఏమైనా పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీం నోరు విప్పనిదే మనకు ఏ విషయం తెలియదు. ఇటీవలే మజిలీతో పెద్ద హిట్ కొట్టిన నాగచైతన్య ఈ సినిమాతో దానిని కొనసాగించాలని చూస్తున్నాడు. ఫిదా టైపులో ఒక పెద్ద హిట్ ఇస్తే తన లైఫ్ సెట్ అయిపోయినట్టే అని భావిస్తున్నాడు. దీనితో అడిగిన వెంటనే మిగతా ప్రాజెక్టులు పక్కన పెట్టి శేఖర్ కమ్ములకు అవకాశం ఇచ్చాడు. సాయి పల్లవి వంటి మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కూడా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. చూడాలి ఈ సారి నాగచైతన్య ఏం చెయ్యబోతున్నాడో?