Sekhar Kammula increased remunerationఎక్కడైనా సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది..ఇక అందులో భాగంగానే రెమ్యునిరేషన్స్ ఉంటాయి. కానీ సక్సెస్ ఇచ్చిన కిక్ అనుకోవాలో, లేక గెలుపు ఇచ్చిన ఈగో అనుకోవాలో తెలీదు కానీ… ఫిదా భారీ సక్సెస్ దర్శకుడు శేఖర్ కమ్ములకి మంచి ఊపును తెచ్చి పెట్టింది.

నిన్న మొన్నటి వరకూ ఓ మోస్తరు రెమ్యునిరేషన్ కి ఒకే చెబుతూ కొత్త వాళ్లతో సినిమాలు చేసుకుంటూ పోయిన శేఖర్ కమ్ముల. ఇప్పుడు ఏకంగా రెమ్యునిరేషన్ విషయంలో భారీగానే డిమాండ్ చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు కోట్లు అడుగుతున్నాడు.

అందులో తప్పు ఏముంది…హిట్ వచ్చిన దర్శకుడు డిమాండ్ చేయడం షరా మామూలే కదా, త్రివిక్రమ్, పూరి లాంటూ వాళ్ళు పదికి పైనే అడుగుతున్నారుగా అంటే, నిజమే అందులో ఏమాత్రం తప్పు లేదు ఎందుకంటే, సినిమా బడ్జెట్ ఏ 40 లేదా 50 కోట్లు అయ్యి ఉంది, మనం వరుస సక్సెస్ లో ఉంటే 10 దగ్గరే మొదలు పెట్టవచ్చు.

కానీ, రాక రాక, అనేక ఫ్లాప్స్ తర్వాత హిట్ వచ్చింది. ఆ హిట్ కే ఏకంగా 7 కోట్లు డిమాండ్ చెయ్యడం ఒక ఎత్తు అయితే, సినిమా బడ్జెట్ మొత్తం 4 కోట్లు ఉండగా దర్శకుడి రెమ్యునిరేషన్ ఏకంగా 7 కోట్లు అడగడమే మరీ హాస్యాస్పదం అని చెప్పవచ్చు.

ఏది ఏమైనా…దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న విషయాన్నీ మన శేఖర్ కమ్ముల లేట్ గా అలవర్చుకున్నట్లు ఉన్నాడు.