Savyasachi story revealedచందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు లుక్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఈ సినిమా ఇతివృత్తం ఏమైవుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.

తాజా సమాచారం మేరకు ‘సిస్టర్ సెంటిమెంట్’ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చైతూ అక్క పాత్రలో భూమిక నటిస్తుండగా, ఆమెకి జరిగిన అన్యాయానికి తమ్ముడిగా చైతూ ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. సినిమాకి హైలైట్ గా నిలిచేది కూడా ఈ అంశమని ట్రేడ్ టాక్.

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా కోలీవుడ్ కం బాలీవుడ్ హీరో మాధవన్ కనిపించనున్నాడు. ఇక రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.