No-Help-For-Naga-Chaitanya-Savyasachi-In-That-Departmentమరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “సవ్యసాచి” సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో సెన్సార్ కు గురైన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ‘బెడ్ రూమ్, ఫకింగ్, బాస్టర్డ్’ అనే పదాలను ‘మ్యూట్’ చేసారు.

అలాగే “కానీ అదే మగవాళ్ళు ఆ ఒక్క అవసరం కోసం అందరి ఆడాళ్ళని కావాలనుకుంటారు” అనే డైలాగ్ ను కూడా పూర్తిగా మ్యూట్ చేసారు. హర్ష మ్యానరిజంలో ఓ సీన్ ను జూమ్ చేసి, ఆ మ్యానరిజంను చూపించకుండా చేసారు. సదరు అంశాలతో కూడిన సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ప్రేమమ్’ రీమేక్ తర్వాత చైతూ – చందు కాంభినేషన్ లో వస్తోన్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో, పాజిటివ్ వైబ్ తో విడుదల అవుతోన్న ఈ సినిమాకు ఆడియో పెద్ద మైనస్ గా మారింది. ఒక్క పాట కూడా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది.