unnamed (22)మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్పాహారం విందు తీసుకున్న తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యలతో కలిసి సత్య కాసేపు గడిపారు. ఈ సమయంలో నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ను ఎత్తుకుని కాసేపు ముద్దాడిన తర్వాత, ఇద్దరూ కలిసి కెమెరా కళ్ళకు చిక్కారు.

సత్య నాదెళ్ళ – నారా దేవాన్ష్ ఇద్దరూ రెండు కళ్ళు బిగ్గరగా తెరిచిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇద్దరూ ఒకే విధమైన హావభావాలను ప్రదర్శించిన ఫోటోను నారా లోకేష్ తన ట్విట్టర్ లో పెట్టారు. దీంతో సత్య నాదెళ్ళతో పాటు దేవాన్ష్ కూడా ప్రజలకు పరిచయం అవుతున్నారు.