Satya Dev to act in chiranjeevi lucifer remakeమెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత చెయ్యబోయే చిత్రం.. మలయాళీ బ్లాక్ బస్టర్ లుసిఫర్ యొక్క రీమేక్. ఇందుకోసం తమిళంలో రీమేక్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన మోహన్ రాజా ని తెలుగులోకి తీసుకుని వచ్చారు చిరంజీవి. ఆ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ పని జరుగుతుందని సమాచారం.

ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం సత్యదేవ్ ని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే కాలంలో సత్యదేవ్ మంచి నటన, ప్రతిభతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కాబట్టి అతనిని ఇంటికి పిలిచి అభినందించి.. చిరంజీవి ఈ రోల్ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే ఆ పాత్ర ఏది అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు.

సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని కలిసి నిర్మించనున్నారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ బిజీ లో ఉన్నారు. ఆ సినిమా తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఏప్రిల్ లో మొదలవచ్చు అని అంచనా.

ఈ ఏడాది లాక్ డౌన్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సక్సెస్ తో సత్యదేవ్ మంచి ఊపు మీద ఉన్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన రెండు చిత్రాలు – తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం సెట్స్ మీద ఉన్నాయి. ఇటువంటి తరుణంలో చిరంజీవి సినిమా చేసే అవకాశం అంటే విశేషం అనే చెప్పుకోవాలి.