satires-on-mahesh-babu-samanthaసోషల్ మీడియా పుణ్యమా అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను నేరుగా సెలబ్రిటీలతో పంచుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో… ఏ చిన్న విషయానికైనా సెలబ్రిటీలకు ట్వీట్లు చేయడం పరిపాటిగా మారిపోయింది. అయితే అందరూ అన్ని సార్లు జవాబులు ఇవ్వకపోవచ్చు గానీ, సెలబ్రిటీలను అమితంగా ఆకట్టుకుంటే మాత్రం స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ అభిమాని పంపించిన మహేష్ – సమంతల ఫోటోను చూసి హీరో రానా నవ్వుకున్నాడు.

ఇంతకీ అంతగా నవ్వుకునే విధంగా ఆ ఫోటోలో ఏముంది అంటే… ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ – సమంతలు ఫోన్ మాట్లాడుకున్న స్నాప్ షాట్స్ ను తీసి, దానిపై హీరో రానా పేరుతో ఓ ఆటో పంచ్ ను క్రియేట్ చేసి రానాకు ట్వీట్ చేసాడు ఓ అభిమాని. దానికి స్పందించిన రానా… ‘హహహహహ’ అంటూ ట్వీట్ చేసాడు. ఇంతకీ ఆ సరదా కాన్వార్ సేషన్ ఏమిటంటే… మహేష్ కు సమంత ఫోన్ చేసి… చిన్నోడా లీడర్ మూవీలో హీరో ఎవరు అంటే..? దానికి మహేష్ ‘రానా’ అని బదులివ్వడం, మళ్ళీ సమంత… రావక్కర్లేదు, ఆన్సర్ చెప్పు చాలు… అంటే ఓరీ దీని ఆటో పంచ్ లో…’ అంటూ అవాక్కవ్వడం మహేష్ వంతయ్యింది.

నిజానికి ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో లెక్కకు మించి హల్చల్ చేస్తుంటాయి. కానీ, ఏ సెలబ్రిటీ కూడా రానా మాదిరి ప్రతిస్పందించరు. అయితే ఇది సరదా సీన్ కావడంతోనే రానా బదులిచ్చారేమో గానీ, ఇలాంటి చిన్న చిన్నవి కూడా సెలబ్రిటీలను ఎంతగా ఆకట్టుకుంటాయో, ఈ ఎపిసోడ్ చెప్పకనే చెప్పింది.