Sarrainodu - Blockbuster Song Promo ఏప్రిల్ 1వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల అవుతున్న బోయపాటి – బన్నీల “సరైనోడు” సినిమా ఆడియో మొదటి ప్రోమోను అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. మొదటి పాటనే ఐటెం సాంగ్ రిలీజ్ చేయడం విశేషం.

అంజలి నటించిన ప్రత్యేక గీతంలో బన్నీ మార్క్ రొటీన్ మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకోవచ్చు. థమన్ స్వరపరిచిన ఈ పాటలో పెద్దగా కొత్తదనం లేకపోయినా… ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడానికి ‘బ్లాక్ బస్టరే’ అన్న పదంతో పాట సాగింది. ఈ పాటకు అంజలినే స్పెషల్ అట్రాక్షన్.