sarkaru vaari paata kalavathi songసూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన “సర్కార్ వారి పాట” మొదటి లిరికల్ సాంగ్ ‘కళావతి’ ఎట్టకేలకు విడుదలైంది. రెండు రోజుల క్రితం విడుదలైన గ్లిమ్స్ కు కొనసాగింపుగా విడుదలైన ఈ సాంగ్ పూర్తి ఆహ్లాదకరంగా సాగింది.

మాంగళ్యం తంతునా… అంటూ పెళ్లి మంత్రాలతో ప్రారంభమైన ఈ పాట లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. థమన్ అందించిన మెలోడీ బీట్ కు అనంత శ్రీరామ్ క్యూట్ సాహిత్యం తోడు కాగా, యధావిధిగా సింగర్ సిడ్ శ్రీరామ్ స్వరం ఈ పాటను మరింత హైలైట్ అయ్యేలా చేసింది.

ఇక అభిమానుల హార్ట్ త్రోబ్ మహేష్ బాబు అయితే చాలా అందంగా కనిపించారు, ఎప్పటి మాదిరిగానే తోటి హీరోయిన్లను డామినేట్ చేసినట్లే, లుక్స్ విషయంలో ‘మహానటి’ కీర్తి సురేష్ ను కూడా పక్కన పెట్టేసేటంతగా ఈ పాటలో మహేష్ కన్నులవిందు చేసాడు.

మహేష్ కాస్ట్యూమ్స్, లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తాయి. అలాగే ‘కళావతి కళావతి.. కల్లోల్లం అయ్యిందే నా గతి’ అంటూ సూపర్ స్టార్ పంచిన హావభావాలు అభిమానులకు వింటేజ్ మహేష్ ను గుర్తు చేస్తాయి. హీరోయిన్ కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ అండ్ లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి.

అయితే ఈ లిరికల్ సాంగ్ లో ఉన్న లోపం ఏమిటంటే… సిడ్ శ్రీరామ్ గెటప్. ఓ గాయకుడిగా శ్రీరామ్ స్వరం ఎంతగా కట్టిపడేస్తుందో, విజువల్ గా ఈ పాటలోని సిడ్ శ్రీరామ్ లుక్స్ అంతగా ట్రోల్ కు గురవుతాయి. ఆ ఒక్కటి పక్కన పెట్టేస్తే… ‘కళావతి’ పాట ఫ్యాన్స్ గుండెల్లో కల్లోల్లం రేపినట్లే!