సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి, సర్కారు వారి పాట మే నెలలో ప్రారంభించబడింది, కాని కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా ఇప్పటివరకూ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తుంది అనేదాని మీద కూడా స్పష్టత లేదు. అయితే ఈ లోగా… ఈ చిత్రం యొక్క తారాగణం మరియు ఇతర సిబ్బంది గురించి అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి.

తాజా విషయం ఏమిటంటే, బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌషల్ మందా ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నారట. ఈ నివేదికలు నిజమైతే, కౌషల్ తన కెరీర్‌లో అతిపెద్ద ఛాన్స్ కొట్టేసినట్టే. 1999లో మహేష్ బాబు మొదటి సినిమా, రాజకుమారుడు లో కౌశల్ చిన్న పాత్ర పోషించాడు. తనను మోడలింగ్ ఏజెన్సీ మొదలు పెట్టమని మహేష్ బాగా ప్రోత్సహించాడని అప్పట్లో కౌశల్ చాలా ఇంటర్వ్యూలలో తెలిపాడు.

సర్కారు వారి పాట గురించి వచ్చిన ఈ వార్త నిజమైతే ఒక ఫ్రెష్ చేంజ్ అనే చెప్పుకోవాలి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి మెగాఫోన్‌ పట్టుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్నాయి. సినిమా లీడ్ లేడీ ఇంకా ఖరారు కాలేదు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనున్నారు.

సర్కారు వారి పాట ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే చిత్రంపై అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో మహేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. సరికొత్త హెయిర్ స్టైల్, చెవికి పోగు, మెడ మీద టాటూ తో మహేష్ గతంలో ఖలేజా, అతిథి టైంలో మహేష్ బాబులా కొత్తగా కనిపించాడు. దర్శకుడు పరశురాం తన కేరీర్ లోని అతిపెద్ద అవకాశాన్ని బాగానే వాడుకున్నాడు ఇప్పటికైతే.