Sarkar Movie teaser- release on 19th octoberమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “స్పైడర్” సినిమా దారుణ పరాజయం పాలైనప్పటికీ, తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న “సర్కార్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు విజయ్ అభిమానులను విపరీతంగా ఆకర్షించగా, తాజాగా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు.

శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు “సర్కార్” టీజర్ ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో యూ ట్యూబ్ లో ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. విజయ్ హీరోగా నటించిన టీజర్లు విడుదలైనపుడు గతంలో యూ ట్యూబ్ రికార్డులు బద్దలు కావడంతో, ఈ “సర్కార్” మరిన్ని సంచలనాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.