AR Murugadoss- Vijay -Sarkar Movieదీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మురుగదాస్ – విజయ్ ల “సర్కార్” సినిమాకు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. సినిమా టాక్ ఎలా ఉన్నా, ఈ సినిమాలో మురుగదాస్ చూపించిన ‘సెక్షన్ 49పి’ సినిమాలో హైలైట్ అయిన అంశాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సెక్షన్ 49పి గురించి గూగుల్ లో వెతకడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల చట్టంలో ఉన్న ‘సెక్షన్ 49 పి’ ప్రకారం… పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటర్ గుర్తిస్తే, వెంటనే ఆ పోలింగ్ బూత్‌ కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చు. ‘సర్కార్’ సినిమాకు ముందువరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉంటుందని ప్రజలకు అస్సలు అవగాహన లేదు. మన రాజకీయ నాయకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఇలాంటి ప్రజా హక్కుల గురించి చర్చించింది లేదు.

దీంతో ఈ సెక్షన్ సీన్ ‘సర్కార్’ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. దీంతో గూగుల్ సెర్చింజన్‌లో ఇదే అంశం టాప్‌‌లో నిలవడంతో, సినిమాను నిర్మించిన సన్ పిక్సర్చ్ గూగుల్ ట్రెండ్స్ రిపోర్టును ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో, అది కాస్త వైరల్ అయింది. మొదటి రికార్డు వసూళ్ళతో ప్రారంభమైన ‘సర్కార్’ ప్రస్థానం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.