Oka Manasu, Oka Manasu Movie, Oka Manasu Movie Trimming, Oka Manasu Movie length, Oka Manasu Slow narration, Oka Manasu Niharika  ఈ ఏడాది బాక్సాఫీస్ ను ఊపేస్తాయని భావించిన రెండు సినిమాలు ‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ విడుదలై ఘోరపరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు ఉన్న పోలిక ఏమిటంటే… సినిమా విడుదలైన రెండవ రోజు నుండి… నిడివిని దాదాపు ఓ 15 నిముషాలు పాటు తగ్గించారు. అయినా ఫలితం మారలేదు… బాక్సాఫీస్ వద్ద ప్రభావమూ చూపలేకపోయాయి.

తాజాగా ఆ ట్రిమ్మింగ్ జాబితాలోకి మెగా తనయురాలు సినిమా “ఒక మనసు” కూడా చేరిపోయింది. స్లో నేరేషన్ ఉందని తొలిరోజు పబ్లిక్ టాక్, సినీ విశ్లేషణలు ముక్తకంఠంతో చెప్పడంతో… సినిమాను నిర్మించిన మధుర శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసారు. ‘హౌస్ ఫుల్స్ తో ఆదరిస్తున్నందుకు సినీ ప్రేమికులకు ధన్యవాదాలు తెలుపుతూ… ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఫస్టాఫ్ లో 14 నిముషాల పాటు ట్రిమ్మింగ్ చేయడమైనది… రెండవ రోజు నుండి ఈ ట్రిమ్ వర్షన్ ప్రదర్శితం కానుంది’ అంటూ సమాచారం అందించారు.

సినిమా విడుదలై, ప్రేక్షకులు తీర్పు చెప్పే వరకు మన సినీ మేధావులకు సినిమాను ఎడిటింగ్ చేయడం కూడా రావట్లేదని ఈ సందర్భంగా నిరూపణ అవుతోంది. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలను నిర్మించే సత్తా సినీ ప్రముఖులకు ఉంటే, వంద రూపాయలు పెట్టి సినిమాకు వెళ్ళే ప్రేక్షకుడు సినిమా ఫలితాన్నే కాదు, సాంకేతిక విభాగాలను కూడా శాసిస్తున్నాడు.