sardaar-gabbar-singh-trailer talkఈ సినిమా పేర్లన్నీ ఏంటనుకుంటున్నారా… “సర్ధార్ గబ్బర్ సింగ్” ధియేటిరికల్ ట్రైలర్ ను చూసిన తర్వాత సినీ ప్రేక్షకులు, విమర్శకులు… ఇంకా చెప్పాలంటే నిష్పక్షపాతంగా మాట్లాడే పవన్ అభిమానులు… చెప్పిన సినిమా పేర్లు ఇవన్నీ. ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ ఇలా ‘కిచిడి’ల మాదిరే ఉంటున్నా, రెండున్నర్ర సంవత్సరాల పాటు పవన్ కష్టపడి రాసిన స్క్రిప్ట్ ను ఒక రెండున్నర్ర నిముషాల్లో చూపించిన తర్వాత సగటు ప్రేక్షకుడికి కలిగిన అనుభూతి ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాపై అంచనాలను భారీగా తగ్గించడంలో విజయవంతం అయ్యింది.

‘ఆగడు’ సినిమా పోలికలు ఎక్కువగా కనపడుతున్నాయన్న టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. అలాగే రాణి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కాజల్ ను చూస్తుంటే ‘మగధీర’ జ్ఞప్తికి రావడం… అలాగే ఊరి కోసం ఫైట్ చేసే సన్నివేశాలు ఖలేజా, కిక్ 2 లను తలపిస్తున్నాయనే టాక్ ను సొంతం చేసుకోవడంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఇక్కడే మరో పెద్ద బాంబు ఏమిటంటే… ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ఏదైతే అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారిందో… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విషయంలో అది చాలా మైనస్ గా కనపడుతోంది.

‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ కావడానికి ఆ చిత్ర పాటలు ఏ రేంజ్ లో దోహదం చేసాయో అందరికీ తెలిసిందే. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను ఒక ఊపు ఊపిన పాటలు అవి. అయితే ‘సర్ధార్’ విషయంలో పాటలు హిట్ కావడానికి ఏ మాత్రం అవకాశం లేవు అనే విధంగా తొలి టాక్ వెలువడింది. మునుపటి సినిమాలో దేవిశ్రీ అందించిన “జోష్” ఈ తాజా చిత్రంలో మిస్సయ్యిందని పాటలు విన్న వారు ఇట్టే చెప్పగలరు. దీంతో అన్ని రకాలుగా ‘సర్ధార్’పై అంచనాలు ఒక్కసారిగా నింగి నుండి నేలకు జారిపోయాయి.