sardaar gabbar singh story inspired from chiranjeevi real life storyఆడియో విడుదల ముందు వరకు సినీ వర్గాల్లో ఓ సందేహంగా హల్చల్ చేసిన ఓ ప్రశ్నకు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో వేడుక ఓ జవాబిచ్చినట్లయ్యింది. ‘సర్ధార్’ సినిమాకు కధ అందించింది పవన్ కళ్యాణ్ అన్న విషయం ముందు నుండి తెలిసిందే. అయితే కధ మాత్రమే కాదు, సినిమాకు దర్శకత్వం వహించింది కూడా పవన్ కళ్యాణేనని, టైటిల్ కార్డ్స్ లో దర్శకుడిగా వేసేందుకు మాత్రమే బాబీ పేరును వినియోగిస్తున్నారని… ఇలా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

కానీ అవన్నీ ఒట్టి పుకార్లుగా భావించిన వారికి ఓ జలక్ ఇచ్చాడు పవన్. “జానీ” సినిమాతో మిమ్మల్ని సరిగా అలరించలేకపోయానని, అయితే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసానని… ఆడియో వేడుకపై ‘సర్ధార్’ సినిమాను ‘జానీ’తో పోలుస్తూ మాట్లాడారు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చాలా మనసు పెట్టి చేసాడని చిరంజీవి చెప్పగా, తన అన్నయ్య చిరంజీవి రియల్ లైఫ్ ను స్పూర్తిగా ఈ కధను రాసుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ట్రైలర్ వీక్షించిన వారంతా మరోసారి పవన్ ‘జానీ’ని రిపీట్ చేసేలా కనపడుతున్నారని, అయినా చిరు కధ ఇంత చెత్తగా ఉంటుందా… అన్న కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. ‘సర్ధార్’తో పవన్ సెన్సేషన్ సృష్టిస్తాడనుకుంటే.., సీన్ రివర్స్ అయ్యేలా కనపడుతుండడం అభిమానులకు ఆందోళన కలిగించే విషయం.