sardaar-gabbar-singh-shooting-completedపవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. స్విట్జర్లాండ్ లో గుమ్మడికాయ కొట్టిన ఈ సినిమా యూనిట్ ఆన్ లొకేషన్ చివరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో రెండు పాటలు కూడా జోడించి శనివారం నాడు పూర్తి స్థాయి సెన్సార్ ను పూర్తి చేయనున్నారు. అలాగే విదేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లతో సంచలనం సృష్టిస్తున్న ‘సర్ధార్’ హైదరాబాద్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ లు మరికొద్ది గంటల్లో తెరుచుకోనున్నాయి.

‘సర్ధార్’కు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను నిర్మాణ సంస్థ విడుదల చేస్తుండడంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానుల్లో ఒకటే సందడి వాతావరణం నెలకొంది. అలాంటి ఫోటోలలో ఒక వైపు మాత్రమే షేవింగ్ క్రీం రాసుకుని ఉన్న ఫోటో… సర్ధార్ లోని తిక్కను చూపిస్తోందని అభిమానులు సరదాగా ముచ్చటించుకుంటున్నారు.